Tnrnews.in
తెలంగాణ

మునగాల: గంజాయి సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్

ఎవరైనా గంజాయిని తాగినా, విక్రయించినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..గంజాయిని తాగి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, గంజాయి వంటి మాదకద్రవ్యాల బారిన పడితే నేరాలు చేస్తారని వాటి నియంత్రణకు పోలీసులకు సహకరించాలన్నారు. గంజాయి మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు.పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో విచ్చలవిడిగా సాంకేతిక రంగం ద్వారా వారి దురాలవాట్లను మనకు రుద్దే ప్రయ త్నం చేస్తున్నారని మంచిని తీసుకుని చెడును వదిలేయాలని సూచించారు. యువత చదువు, క్రీడలు తప్పా ఇంకో ఆలోచన దరికి చేర నీయొద్దన్నారు.పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో విచ్చలవిడిగా సాంకేతిక రంగం ద్వారా వారి దురాలవాట్లను మనకు రుద్దే ప్రయ త్నం చేస్తున్నారని మంచిని తీసుకుని చెడును వదిలేయాలని సూచించారు. యువత చదువు, క్రీడలు తప్పా ఇంకో ఆలోచన దరికి చేర నీయొద్దన్నారు.యువత గంజాయి మత్తులో జీవితాలు నాశనం చేసుకుని కుటుంబాలకు శోకం మిగిల్చవద్దని సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

TNR NEWS

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

TNR NEWS

కొడంగల్‌ను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చనున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

ఘనంగా కార్తీక దీపోత్సవం

TNR NEWS

ఎలక్ట్రానిక్ వాహన షోరూం ప్రారంభించిన ఎస్సై 

TNR NEWS

బీసీ ఆజాది ఫెడరేషన్ జూలపల్లి మండల అధ్యక్షునిగా వోడ్నాల తిరుపతి నియామకం..

TNR NEWS