మండల పరిధిలోని ఊరెళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కొందరు విద్యార్థులు వివిధ శాఖల అధికారులుగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రిగా ఆయేషా సిద్దిక, కలెక్టర్ గా మహమ్మద్ సిరాజ్ హుస్సేన్, జిల్లా విద్యాశాఖ అధికారిగా మహమ్మద్ సమీర్, ఉప విద్యాధికారిగా ఆయేషా ఫాతిమా, మండల పరిషత్ అధికారిగా సోఫియా, మండల విద్యాధికారిగా అర్బాన్, ప్రధానోపాధ్యాయులుగా చరణ్ తేజ వ్యవహరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజ నాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మహమ్మద్ జహంగీర్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.