Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అక్షర యోధుడు కాళోజి

కోదాడలోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ విభాగం(జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని “తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు” నిర్వహించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి, తెలుగు ఉపన్యాసకులు వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ…

సమాజంలోని సామాన్య ప్రజలు సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా జీవించడానికి ప్రేరణ కల్పించిన మహోన్నత వ్యక్తి కాళోజి అని, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముతామని, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేస్తామని, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణ కష్టాలను కవిత్వం గా మార్చి, సరళమైన భాషకు పట్టం కట్టి, తన అక్షరాలతో సామాన్యులకు పట్టం కట్టినవాడు కాలోజీ అన్నారు. తెలుగు భాష మాట్లాడడానికి వెనకాడుచున్నటువంటి వాళ్లకు గట్టి చురకలు వేశాడు. ఆయన కవిత్వమంతా సమాజ గొడవగా, సామాన్యుని గొడవగా కొనసాగిందనీ,పేదల సమానత్వం కోసం ,న్యాయం కోసం నిరంతరం పోరాటం చేశారని, బడి పలుకుల భాష వద్దని, పలుకుబడుల భాష కావాలని వ్యవహారికంలోనే రచన చేశారని అన్నారు. అక్షరం మనిషిని బానిసత్వం వైపు కాకుండా విముక్తి వైపు తీసుకెళ్తుందని రమణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ఆర్.పిచ్చి రెడ్డి, జి.యాదగిరి, వి. బల భీమారావు, ఆర్. రమేష్,పి.రాజేష్, ఎం. రత్నకుమారి, జి .వెంకన్న, కె. రామరాజు, జి. రవి కిరణ్, కే .సతీష్, జి. నాగరాజు, పి. తిరుమల, ఈ.నరసింహారెడ్డి, ఎస్.గోపికృష్ణ, ఎస్.కె. ముస్తఫా, ఎస్. కే. ఆరిఫ్, ఎన్. జ్యోతిలక్ష్మి, ఆర్. చంద్రశేఖర్, ఎస్.వెంకటేశ్వర చారి, టి.మమత, డి .ఎస్. రావులతో పాటుగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంపై హర్షం

TNR NEWS

జర్నలిస్టు రఘు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మంద కృష్ణ మాదిగ

Harish Hs

కెఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కామర్స్ పోస్టుకు దరఖాస్తులకు ఆహ్వానం

Harish Hs

వైభవంగా శ్రీశ్రీశ్రీ లక్ష్మి కోట మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం

TNR NEWS

గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Harish Hs