Tnrnews.in
తెలంగాణ

దామరగిద్దలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద గ్రామ గేట్ వద్ద ఆ గ్రామ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శివాజీ యూత్ అధ్యక్షుడు సీహెచ్ మల్లేష్ మాట్లాడుతూ.. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషిచేసిన, పోరాడిన యోధుడు శివాజీ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత శివాజీ అడుగుజాడల్లో నలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ సభ్యులు మహేందర్, రాజు, వెంకటేష్, రజినీకాంత్, మధు, రాజశేఖర్, శ్రీను, శివకృష్ణ, అఖిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ వాసికి డాక్టరేట్ ప్రధానం

Harish Hs

గుడిబండ గ్రామంలో ఉర్సులో తీవ్ర విషాదం

Harish Hs

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs

1 కోటి 93 లక్షల 49 వేల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS

వెంకటరెడ్డి మృతి బాధాకరం:టీపీసీసీ డెలిగేటు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

Harish Hs

విజ్ఞాన కేంద్రం స్థాపన కోసం భూమి కేటాయించలి  :- సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ 

TNR NEWS