రైతులపై మొండు వైఖరి చూపెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. బుధవారం బొల్లు ప్రసాద్ నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మనదేశంలో 1040 మిలియన్ల హెక్టార్ల భూమికి 300 20 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి వీటిని కేంద్ర పాలకులు ఉత్పత్తి చేయటానికి సంబంధిత చర్యలు తీసుకోకపోగా ఇతర దేశాల నుండి 70, 80% దిగుమతి చేసుకొని రైతులకు అందించాలి అన్న ఆలోచన కొనసాగిస్తున్నారు. ఇది ఆచరణలో రైతులకు అవసరమైన ఎరువులు అందకపోగా యూరియా కొరత విపరీతంగా పెరిగిపోయింది సబ్సిడీలు కూడా ఎరువులపై ఇవ్వటానికి కేంద్ర పాలకుల సిద్ధంగా లేరు అని అన్నారు. ఉన్న సబ్సిడీలను కూడా ఎత్తివేశారు దేశ వ్యవసాయం కు అవసరమైన ఎరువుల ఉత్పత్తికి నికరమైన చర్యలు భవిష్యత్తులో తీసుకోవడం ద్వారానే దేశ రైతాంగానికి అవసరమైన ఎరువులను సరఫరా చేయగలగటానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ సీజన్ లో కూడా యూరియా నా నానో యూరియా నా అందుబాటులోకి తీసుకురావటానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నికరమైన చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ముందస్తు చూపుతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని బాగు చేసుకోగలిగి ఉత్పత్తి చేసుకోగలిగితే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసి కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన పూర్తిస్థాయి కోటాను పొందటానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలను ఉదృతం చేయాలి అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తాం అని అన్నారు. వ్యవసాయ అధికారులపై ప్రభుత్వ అధికారులపై ఎక్కడికక్కడ రైతులు అందరూ కలిసి ఒత్తిడి తీసుకురావడం ద్వారా యూరియాను పొందటానికి సిద్ధం కావాలని కూడా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోరింది. కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి పంట నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కవులు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్, మాతంగి ప్రసాద్, కమతం కుటుంబరావు, కమతం సైదయ్య, ఎర్ర సురేష్, కొల్లు శ్రీనివాసరావు, కనకాల పూర్ణయ్య, బొమ్మకంటి లక్ష్మీనరసు, గోనెల నాగభూషణం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.