మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామంలో అమ్మాపురం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం కార్యక్రమం నిర్వహించినారు.ఈ సందర్బంగా సేవా ట్రస్ట్ తరుపున గ్రామ రైతన్నలు పాక వెంకన్న, గుంటుక సతీష్, యాకాంభ్రం లను జాతీయ రైతు దినోత్సవం రోజున సన్మానించారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిధి తొర్రూర్ మండలం రైతు సంఘం కార్యదర్శి కొత్త వెంకట్ రెడ్డి రైతు మిత్రులనుద్దేశించి మాట్లాడుతు.. ఓర్పు, సహనం, ఆత్మవిశ్వాసానికి చిహ్నం రైతన్న అన్నారు.రైతు వ్యవసాయంను పండగలా చేసేరోజులు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి సంతోష్, పాక బ్రహ్మం, లింగాల మురళి కృష్ణ, పబ్బోజు సదా నంద చారి, గట్టు రాజు, గ్రామ రైతులు పాల్గొన్నారు.