వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కావలి మల్లేశం, ఖలీల్ పాషా, కురువ ప్రవీణ్, కురువ మల్లేశం, మహేష్ కుమార్ లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి బీ ఆర్ స్ పార్టీ లో చేరడం జరిగింది. వికారాబాద్ జిల్లా బీ ఆర్ స్ పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాసంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలని మోసం చేసిందన్నారు.
ఆరు గ్యారెంటీల సంగతి పక్కన పెడితే ప్రజా ధనాన్ని వృధా చేస్తూ, కనీస ప్రజా సమస్యలని పట్టించుకునే స్థితిలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంతో మంది నష్టపోయారన్నారు.
తెలంగాణ తిరిగి అన్ని రంగాల్లో అభివృద్ధి, పథంలో ముందుండాలంటే అది కేవలం బీ ఆర్ స్ పార్టీ, కెసిఆర్ తోనే సాధ్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో బీ ఆర్ స్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నాయకులు ఘయాజ్, మహిపాల్ రెడ్డి, అశోక్, మల్లేష్, కావలి వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.