న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నరసయ్య, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లు అన్నారు. బుధవారం కోదాడ కోర్టులో నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని,అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు,బార్ సభ్యులు పాల్గొన్నారు.
previous post
next post
