Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ధర్మ పీఠం పై దాడి హేయమైన చర్య బరితెగించిన మతోన్మాదిని శిక్షించాలి.  లౌకిక, ప్రజాస్వామిక,రాజ్యాంగ స్పూర్తిని కాపాడాలి  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

మోతే :దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్‌ గవాయ్ పైనే ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లిసైదులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బరితెగించిన మతోన్మాది రాకేష్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేసి దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ శక్తులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం కేసు విచారణ సమయంలో డయాస్‌ వద్దకు వెళ్లిన న్యాయవాది రాకేష్‌ కిషోర్‌ ఒక్కసారిగా తన స్పోర్ట్స్‌ షూ తీసి, సిజెఐపైకి విసిరే ప్రయత్నం చేయడం రాజ్యాంగ వ్యవస్థకు అవమానకరమన్నారు. భారత చరిత్రలో ఇది చీకటి రోజు అని అన్నారు.సనాతనం పేరుతో జరిగే దాడులను భారత సమాజం సహించదు అన్నారు. ప్రధాన న్యాయమూర్తి పైన దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపై జరిగిన దాడి అన్నారు. సమిష్టిగా భారత సమాజం గవాయ్ కుసంఘీభావంగా,అండగా నిలవాలని కోరారు. ఈ బుద్ధిహీనమైన చర్య ఈ సమాజాన్ని ద్వేషం, మతోన్మాదం ఎలా ముంచెత్తాయో చూపిస్తుందని విమర్శించారు. ఈ చర్య దురదృష్టకరమని, ఖండించదగినదని, ఈ ఘటనను న్యాయవ్యవస్థపై దాడిగా పేర్కొన్నారు. ఈ ఘటన సాధారణంగా జరిగింది కాదని,స్వతంత్ర న్యాయవ్యవస్థపై జరిగిన బహిరంగ దాడిగానే పేర్కొన్నారు. దీనిని వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తి చేసిన చర్యగా పరిగణించలేమని, సంఘ్ పరివార్ శక్తులు దేశంలో న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పై,న్యాయ సమీక్ష శక్తి పై లౌకికవాద భావనపై దుర్మార్గపు దుర్భాషలతో ప్రచారంలో భాగంగా దీనిని చూడాలని అన్నారు.దీనిని సహించలేమని, సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా న్యాయ సోదరభావం కలిగినవారు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఘటనను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని, నిందితుడి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థపై దాడి జరిగి 24 గంటలు అవుతున్నా ప్రధానమంత్రి,రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతినోరుమెదపకపోవడం రాజ్యాంగం పట్ల రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఏ పాటి గౌరవం ఉందో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.సనాతన ధర్మం అంటే దాడులు చేయడమా అన్నారు.వందేండ్ల ఆర్ఎస్ఎస్ సంఘపరివారశక్తులు నేర్పుతున్నది ఇదేనా అన్నారు.వందేళ్ల ఆర్ఎస్ఎస్

కార్యచరణ వ్యవస్థ పై దాడి చేయడానికి సిద్ధమయిందా! అన్నారు.ధర్మ పీఠం పై దురాక్రమణ దాడి జాతి విచ్చిన్నానికి నిదర్శనం అన్నారు.సనాతన ధర్మం పేరుతో మను ధర్మాన్ని ప్రతిష్ఠంచదలుచుకొని ఈ దాడులకుతెగబడుతున్నారన్నారు.అంబేద్కర్ వ్రాసిన రాజ్యంగ ధర్మం కంటే ఈ భారత దేశంలో మరేధర్మం గొప్పది కాదన్నారు. రాజ్యాంగ వ్యవస్థను ఉంచదల్చుకోలేకనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.

షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన మేధావి ఆ వ్యవస్థ మీద కూర్చోవడం బిజెపి జీదించుకోలేకపోతుందన్నారు. భారతదేశాన్ని ఆదునికరించింది.రాజ్యాంగ ధర్మం అన్నసంగతి యాది మరువొద్దు అన్నారు.లౌకిక, ప్రజాస్వామిక,రాజ్యాంగ ధర్మాన్నికాపాడుకోవాలన్నారు.

రాజ్యాంగ వ్యవస్థల పట్ల విలువలు ఉన్నవాల్లు ఒక దగ్గరకు రావాలన్నారు. ఈ చర్యను భారత సమాజం ముక్తకంఠతో ఖండించాలన్నారు.

Related posts

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి

Harish Hs

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలి…. ఈ నెల 24న సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ఊరూరా ఉద్యమకారుల పాదయాత్ర పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి

TNR NEWS

టి పి టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ

TNR NEWS

ఎలక్ట్రానిక్ వాహన షోరూం ప్రారంభించిన ఎస్సై 

TNR NEWS

అనంతరం, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా రేపు వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా

TNR NEWS

ఆ సర్వీసు రోడ్లపై పేరుకుపోయిన మట్టిని తొలగించాలి : సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు

TNR NEWS