అణగారిన అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమానికి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు మహాత్మ జ్యోతి రావు పూలే అని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పైడిమర్రి సత్తిబాబు, కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ లు అన్నారు. గురువారం పూలే వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేయడంతో పాటు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని కొనియాడారు. అందరికీ సమానంగా విద్యను అందించడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపిన గొప్ప మహనీయుడు అని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలోచింతల నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కర్ల సుందర్ బాబు, సంగిశెట్టి గోపాల్, ఛీమ శ్రీనివాసరావు, పిట్టల భాగ్యమ్మ, కాసాని మల్లయ్య, చెలిగంటి వెంకట్, గొర్రె రాజేష్, అసేన్, జానీ, మజాహర్, బుచ్చి బాబు, కొట్టే నాగేంద్ర, అలిమ్, దస్తగిరి,అప్రోజ్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు…………