Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి -స్వేరోస్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ

మోతె : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే – ఇక భారత దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది.సోమవారం సుప్రీంకోర్టులో ఓ కేసు నిమిత్తమై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై ఓ వ్యక్తి అనూహ్యంగా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నావంటూ చెప్పుతో దాడి చేయడానికి పాల్పడడం హేయమైన చర్య అని స్వేరోస్ నెట్వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ మండిపడుతూ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వ్యక్తి తన సనాతన ధర్మం పై జస్టిస్ గవాయ్ పట్ల ఏదైనా ఇబ్బంది కలిగించివుంటే చట్టప్రకారంగా కోర్టులోనే పిటిషన్ వేసి పోరాడలే కానీ ఇలా పిరికివాడిలా చేతకానితనంలా చట్టాలను తుంగలో తొక్కుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై ఈ విధంగా దాడికి పూనుకోవడం సరికాదన్నారు. భారత న్యాయవ్యవస్థకే అవమానం అని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Related posts

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.   ప్రశ్నించే గొంతులకు పట్టం కట్టండి.  కలిసివచ్చే లౌకిక శక్తులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం…. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

అర్హులకు అన్యాయం జరగదు.. • మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా

TNR NEWS

కోదాడ నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి,మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

TNR NEWS

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే విధంగా మీ కమిటీ పని చేయాలి…

TNR NEWS

వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి 

Harish Hs

ప్రవేట్ టీచర్లకు గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వాలి – టిపిటిఎల్ఎఫ్ డిమాండ్

TNR NEWS