తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహాలు,రేషన్ కార్డులు, ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ,వార్డు సభలో అధికారులకు సహకరిస్తూ దరఖాస్తులు చేసుకోవాలని మునగాల మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా గురువారం, ఆయన మాట్లాడుతూ… అధికారులు ప్రకటించిన లిస్టులో పేరు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ లిస్టు ఫైనల్ కాదని లిస్టులో పేరు లేని అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. కావాలని కొంతమంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నిజమైన అర్హులను ప్రభుత్వం గుర్తించి తప్పకుండా వారికి న్యాయం చేస్తుందని ఆయన తెలిపారు. ఒక నియోజకవర్గానికి మొదటి విడత 3 వేల 500 వందల,ఇండ్లను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందేనని అందులో భాగంగా ప్రతి గ్రామం నుండి మొదటి విడుదల 15 నుండి 20 వరకు ఇండ్లను మంజూరు చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజా పాలనలో అవినీతికి ఆస్కారం ఉండదని అర్హులైన ప్రతి ఒక్కరికి అధికారులు న్యాయం చేస్తారని ఎక్కడైనా అన్యాయం జరిగితే తన దృష్టికి తీసుకురావాలని ఈ విషయంపై స్థానిక కాంగ్రెస్ నేతలు నాయకులు కార్యకర్తలు లబ్దిదారులకు అండగా ఉండి వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పైరవీలకు తావు లేదని ఎవరిని నమ్మి మోసపోవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకాన్ని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లక్ష్యమని ఆయన తెలిపారు. మంగళవారం మొదలైన గ్రామ వార్డు సభల్లో అక్కడక్కడ చిన్నచిన్న గందరగోళాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని వాటిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని,ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
