తెలంగాణ : రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా రేపు తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని TRP అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో తగిన, న్యాయసమ్మత నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.