కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలకేంద్రంలో సంస్థాన్ బండాయప్ప మఠం వద్ద సోమలింగ శివాచార్య మహారాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సద్గురు బండాయప్ప స్వామి పుణ్యతిథిని ఘనంగా నిర్వహించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ ఎన్ రాజు శ్రీహరి, డా రాజు, సంజు పటేల్, శ్రీనివాస్, తదితరులున్నారు.