Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడ పట్టణ, నియోజకవర్గ నిరుద్యోగులకు గొప్ప సువర్ణ అవకాశం

కోదాడ, అక్టోబర్ 23: ఈ నెల 25న హుజుర్ నగర్ పట్టణం లో పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఎస్ఎస్సిఎల్, డిఈఈటి సౌజన్యంతో మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యం లో నిర్వహించే మెగా జాబ్ మేళాను కోదాడ పట్టణ, నియోజకవర్గ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరని టిపిసిసి డెలిగేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల అనగా 25 -10- 2025 శనివారం ఉదయం 8.30నుంచి సాయంత్రం 5.00గంటల వరకు. హుజూర్ నగర్ పట్టణంలోనీ పేర్లి ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటిఐ, డిప్లమో, బీటెక్, ఫార్మసీ, ఎంబీఏ విద్యార్థులు అర్హులని 18 నుంచి 40 సంవత్సరాల నిరుద్యోగులు https://డీటైల్స్.తెలంగాణ.gov.in సైట్ ఓపెన్ చేసి క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరని తెలిపారు. నిరుద్యోగులు వచ్చేటప్పుడు రెండు పాస్ ఫోటోలు, ఐదు సెట్లు రెస్యూమ్ తీసుకొని రాగలరు. ఈ సదావకాశాన్ని నిరుద్యోగ యువతి, యువకులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related posts

ప్రభుత్వ పథకాలకు మరో అవకాశం

TNR NEWS

నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

గులాబీ జెండా ప్రజలకు అండ  ఏప్రిల్ 27 చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల

TNR NEWS

ఘనంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

TNR NEWS

వయోవృద్ధులు చట్టాలు ఉపయోగించుకోవాలి

Harish Hs