నారాయణపేట జిల్లా మద్దూర్ మునిసిపల్ కేంద్రంలోని తహిసిల్దార్ కార్యాలయం ముందు ఎరుకలి పందుల పెంపకందారులు మరియు ప్రజాసంఘాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పందుల పెంపకందారుడు బలప్ప మాట్లాడుతూ మేము పందులను పెంచుకొని జీవనోపాధి పొందుచున్నాము అయితే మద్దూరు మున్సిపాలిటి కమీషనర్ గారు మమ్ములను రెనివట్లలో మరియు మద్దూరులో పందులను పెంచవద్దని చెప్పుచున్నారు. మమ్ములను నిన్న అనగా తేది 22.10.2025 రోజు కమీషనర్ గారు పిలిపించి మమ్ములను పందులను పెంచుకోవద్దు అన్నారు. మేము కమీషనర్ గారికి పందులపై ఆధారపడి జీవిస్తున్నాము అని లేకపోతే మాకు జీవనోపాధి లేదు అని చెప్పాము మరియు మీరు పందులను పెంచవద్దు అంటే మేము చనిపోతాం. మాకు బతుకు లేదు అని అంటే అప్పుడు కమీషనర్ గారు మీరు చనిపోండి అని భయపెట్టినాడు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూయించండి అని మేము కొరినము అప్పుడు పందులను తీసివేస్తాము అని చెప్పినాము. మాకు వందుల పెంపకం కొరకు ప్రభుత్వ భూమిలో కొంత భూమికి కేటాయించగలరని కోరడం జరిగింది మరియు మాకు వేరే ఉపాధి చూయించగలరని కొరినము, కానీ కమిషనర్ గారు మా మాటలను పాటించుకోకుండా పోలీసులను పెట్టి మేములను కోటిస్తా సోమవారం వరకు గడువు లేకపోతే పందులు మందుపెట్టి సముపుతా అంటూ అలాగే ఎరుకలి వాళ్లు మీరు ఏంచేస్తారు అంటూ బెదిరించారని అన్నారు
సీపీఎం పార్టీ ఏరియా కరియదర్శి గోపాల్, సీపీఎం( ఎం ఎల్ ) నాయకులు కె. నర్సింహులు మద్దతు ఇచ్చి వారు మాట్లాడుతూ పందుల పెంపకదారులపై చేస్తున్న దాడులను అరికట్టాలని కమిషనర్ పందుల పెంపకదారులపై ఇష్టానుసారంగా భయపెడుతూ బెదిరించిన మున్సిపల్ కమీషనర్ పై చర్య తీసుకొనగలరని ఏసీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకెలాలని తహిసిల్దార్ కి వినతి ద్వారా కోరారు తదనంతరం జీవనోపాధి అయిన పందుల పెంపకంను కొనసాగించుటకు అవకాశము కల్పించగలరాని మరియు వారికి ప్రత్యామ్నయ ఉపాధి అవకాశాలు కల్పించ గలరని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ, ఎరుకలి పందుల పెంపకందరుల సంఘం నాయకులు అంజి, కిష్టప్ప, కృష్ణ, రాములు, తదితరులు పాల్గొన్నారు.
