యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్ అన్నారు.
బుధవారం ఆందోల్ మండలం చందంపేట,అలమాయిపేట, అందోల్ గ్రామాల్లో రైతు సంగం ఆధ్వర్యంలో పర్యటించి తడిసిన ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడి దైర్యం గా ఉండాలని అన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులు గా కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యం వెంటనే కొనాలని చెప్పిన అమలు కావటం లేదని అన్నారు.పంట చేతికొచ్చి నెలలు గడుస్తున్నా ధాన్యం తూకం చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు.నిర్లక్ష్యం వహించిన అధికారులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తూకం చేసిన ధాన్యం గోదాముల కు తరలించడంలో సకాలంలో లారీలు పంపించడంలో అధికార నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తుందని అన్నారు. అనేక కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయిందని అన్నారు. దీనికి సంబందించిన అధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలని అన్నారు.వర్షాలకు తడిసి అనేక కేంద్రాల్లో వడ్లు మొలకెత్తయని తక్షణమే తడిసిన వడ్లను ప్రభుత్వం మ్యాచెస్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని తేమ, తాలు పేరుతో తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు గురి చేయొద్దని అన్నారు.తూకం చేసిన ధాన్యం సైతం కేంద్రాల్లో 15 రోజులకు పైగా ఉండడం చాలా దుర్మార్గమని అన్నారు.నెలరోజుల తరబడి రైతులు టార్పాలిన్లు, కవర్లు కప్పుతూ కిరాయికి తెచ్చుకొని అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.తక్షణమే కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైస్ మిల్లుల చర్యలు తీసుకోవాలి
ధాన్యం కొనుగోలు లో అధికారుల మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా లేదని రైతు సంగం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు అన్నారు. రైతులు మా సమస్య పరిస్కారం చేయాలనీ, లారీలు పంపించాలని వారం రోజులు గా అడిగిన స్పందించటం లేదని అన్నారు. లారీలు పంపని వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తరుగు క్వింటల్ కు 6-7 కిలోలు రైస్ మిల్ వారు తీస్తుంటే జిల్లా అధికారులు ఎం చేస్తున్నారని అడిగారు. రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా దానిపై విచారణ జరిపి రైతులను ఆడుకోవాలని అన్నారు. లేదంటే ఉద్యమం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంగం జిల్లా అధ్యక్షులు కె.రాజయ్య,సిపిఎం అందోల్ డివిజన్ కార్యదర్శి డి.విద్యసాగర్,రైతు సంగం నాయకులు ప్రభాకర్,మల్లారెడ్డి, రైతులు సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, శివకుమార్,శ్రీనివాస్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.