హైదరాబాద్ : 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సినీ దర్శకుడు సాయికిరణ్ అడివి చిత్ర బృందం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రథా పిక్చర్స్, సాయి సినీ చిత్ర సంయుక్త బ్యానర్లపై సురేష్ కుమార్ దేవత, హరితా దుద్దుకూరు, ప్రతిభా అడివి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా పదహారు రోజుల పండుగ చిత్ర బృందం నూతన సంవత్సర వేడుకలు సీనియర్ నటి రేణుదేశాయ్ (రాజమ్మ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా కలిపి నూతన సంవత్సర కేకు కట్ చేసి, ఒకరికి ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటీమణి రేణుదేశాయ్ (రాజమ్మ), సినీ దర్శకుడు సాయికిరణ్ అడివి, హీరో సాయి కృష్ణ, హీరోయిన్ గోపికా ఉదయన్, నిర్మాత సురేష్ కుమార్ దేవత, సోమ శేఖర్ పొక్కల్లా, సహా నిర్మాత అమృత వర్షిణి దేవత, సీనియర్ నటుడు అశోక్ కుమార్, ఎడిటర్ సూర్య తేజ లంకా, రెండవ యూనిట్ దర్శకుడు మల్లి అంకం, కో-డైరెక్టర్ మహీదర్ బెల్లపు, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ రాము మన్నార్, ప్రొడక్షన్ మేనేజర్లు రాజేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
