November 18, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జోగిపేట వ్యాపారి వినయ్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి  సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు

జోగిపేటః సంగారెడ్డి జిల్లా తాడ్దాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద జోగిపేటకు చెందిన వ్యాపారస్తుడు కటుకం ప్రవీణ్‌ కుమారుడు కటుకం వినయ్‌ కుమార్‌పై టోల్‌గేట్‌ సిబ్బంది రాడ్‌తో దాడి చేయడంతో వినయ్‌ తలపగిలి పోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం జోగిపేట వైపు నుంచి సంగారెడ్డికి వినయ్‌ తన స్నేహితులతో కలిసి టీఆర్‌ నంబరు గల కొత్త కారులో వెళుతూ టోల్‌టాక్స్‌ వద్ద లోకల్‌ అని చెప్పినా సిబ్బంది వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మద్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో చాలా సేపటి వరకు ఉద్రిక్తత ఏర్పడింది. టోల్‌ ప్లాజా సిబ్బంది అక్కడే ఉన్న ఇనుప రాడ్‌తో వినయ్‌ తలపై బలంగా కొట్టడంతో రక్తస్రావం అయ్యింది. దీంతో అక్కడికి చేరుకున్న వినయ్‌ స్నేహితులు దాడి చేసిన వ్యక్తి కోసం ఆ ప్రాంతమంతా గాలించారు. దాడి చేసిన వ్యక్తి తమకు కావాలని పట్టుబట్టారు. సుమారు అరగంట సేపు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జోగిపేట సీఐ అనీల్‌కుమార్, ఎస్‌ఐలు క్రాంతి, పాండులు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలం వద్దకు చేరుకొని అందరిని చెదరగొట్టారు. టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించి భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జోగిపేట సీఐ అనీల్‌కుమార్‌ తెలిపారు.

Related posts

ప్రతిష్టించిన చోటే గణేష్ ని నిమజ్జనం

TNR NEWS

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS

బీర్పూర్ లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

TNR NEWS

పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు… సీఐ శివ శంకర్ నాయక్

TNR NEWS

ఆపదలో అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి

TNR NEWS