కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడతూ బిచ్కుంద మండలంలోని గ్రామాల నాయకులు, కార్యకర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యేతో చర్చించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నాయకులకు, కార్య కర్తలకుహామీఇచ్చారు.నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం మెరుగుపరచడమే తన ప్రాథమిక లక్ష్యమని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు.ఇందులో బిచ్కుంద మండల నాయకులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
