ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తుందని అదే పార్టీ ఎ జెండా అని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల కేంద్రంలో జెర్రిపోతుల గూడెం గ్రామంలో ఉద్దండు నారాయణ ఇంట్లో జరిగిన మండల కౌన్సిల్ సమావేశం కే వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాయణపురం జెర్రిపోతులగూడెం సిపిఐ పార్టీ సర్పంచులు గా విజయం సాధించారని అదే దానికి నిదర్శనం అన్నారు. చిలుకూరు గ్రామ పంచాయతీలో సిపిఐ పార్టీని సహించలేని కొన్ని శక్తులు పరస్పర వర్గ శత్రువులైనప్పటికీ ఏకమై సిపిఐ పార్టీ నీ ఓడించారని అయినా సిపిఐ పార్టీ కి 2300 ఓట్లు సాధించి బలాన్ని నిరూపించుకుందని ఆయన అన్నారు. సిపిఐ పార్టీ గెలిచినా ఓడిన ప్రజల మధ్యన నిరంతరం పోరాడుతుందని కార్యకర్తలు అధైర్య పడకుండా ధైర్యంతో ముందుకెళ్లి రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని వారు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 వ శత జయంతి ఉత్సవాలు జనవరి 18/ 2026 ఖమ్మంలో జరిగే బారి బహిరంగ సభకు 2000 మంది పార్టీ కార్యకర్తలని తరలించాలని మండల కౌన్సిలర్ నిర్ణయించినట్టు తెలియజేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు నంద్యాల రామిరెడ్డి, ఎస్ కే సాయి బల్లి, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు రాజు, జెర్రిపోతుల గూడెం. సర్పంచ్. ఉప సర్పంచ్ గుగులోతు లలిత, ఉద్దండు దుర్గ, మండల కార్యవర్గ సభ్యులు సిలువేరు ఆంజనేయులు, తాళ్లూరు పెద్ద మల్లయ్య, బెజవాడ వినోద్, కట్ట కోల నాగేశ్వరావు, బలబోయన రాంబాబు, సిరాపురం శ్రీను, బిక్షం రెడ్డి,కందుకూరి శ్రీను, బాదే నరసయ్య, రెమిడాల జయసుధ, సాతులూరి అలివేలు, తదితరులు పాల్గొన్నారు.
