సూర్యాపేట పట్టణంలో జరుగుచున్న సామజిక, ఆర్ధిక,విద్య,ఉపాధి,రాజకీయ మరియు కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు పట్టణ ప్రజలు సహకరించి ఎన్యుమరేటర్లకు పూర్తి సమాచారం ఇవ్వాలి అని మున్సిపల్ కమీషనర్ బి .శ్రీనివాస్ అన్నారు .ఈరోజు పట్టణంలోని వివిధ వార్డు లలో 39 వ వార్డులో జరుగుచున్న సర్వేను పరిశీలించి ఎన్యుమరేటర్లకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు,39 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి మొరిశెట్టి సుధారాణి శ్రీనివాస్ తమ వార్డ్ లో జరుగు చున్న సర్వే ను ఇల్లీలు తిరిగి కమీషనర్ తో కలిసి పరిశీలించారు .గృహయజమానులు తప్పని సరిగి తమ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు లు, వ్యవసాయ భూమి వున్న వారు ధరణి పాస్ పుస్తకములు దెగ్గర పెట్టుకొని సర్వే లో ఎంట్రీ చేయించుకోవాలి అన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ,డీలింగ్ అస్సిటెంట్ గోపారపు రాజు, ఎన్యుమరేటర్లు, మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి శ్రీను, తదితరులు పాల్గొన్నారు