ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో 32 ప్రపంచ రికార్డులుసాధించిన శ్రీశ్రీ కళావేదిక తెలుగు సంస్కృతి సామాజిక సేవా సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సారథ్యంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం మరియు శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి కవనోత్సవం, 141వ జాతీయ శతాధిక సమ్మేళనం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సెమినార్ హాలు నందు తెలుగు భాష ఔన్నత్యాన్ని విశిష్టతను ప్రతిబింబించేలా తెలుగు భాష వికాసానికి దోహదపడే సాహిత్య సదస్సును కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో
సూర్యాపేట పట్టణానికి చెందిన కవి,రచయిత,సామాజిక కార్యకర్త డా. పోతుగంటి వీరాచారి పాల్గొని కవిత గానం చేశారు.
ఈ కార్యక్రమంలో వీరాచారిని, ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఆచార్య ప్రొఫెసర్ జ్యోతిర్మయి, రిజిస్టర్ ఆచార్య డాక్టర్ సుధాకర్, కన్వీనర్ తర్పట్ల సత్యనారాయణ, అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్,జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి గార్ల చేతుల మీదుగా పురస్కార పత్రాన్ని అందజేసి ఘనంగా శాలువతో సత్కరించి మెమోటో ప్రశంస పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డా.మాడుగుల జార్జ్ కుమార్, రాజేంద్రప్రసాద్, శివరాత్రి వెంకన్న, చిట్యాల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.