మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామ విశ్వబ్రాహ్మణ వీధి ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బందిని అభినందించడం జరిగింది. గ్రామంలోని మొదటి వార్డుకు చెందిన విశ్వబ్రాహ్మణ వీధి రోడ్డు పై గుంపులు గుంపులు గా పిచ్చి చెట్లు పెరిగి దోమలు, విషపూరిత కీటకాలకు, పాములకు నిలయంగా ఉండేది. పిచ్చి చెట్లు పాములకు అవాసంగ మారి ప్రజలు భయబ్రాంతులకు లోనైనా సంఘటన అమ్మాపురం, విశ్వబ్రాహ్మణ వీధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించి రెండు రోజుల క్రితం పిచ్చి చెట్లను తొలగించడం జరిగింది. దీనితో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అమ్మాపురం గ్రామ పంచాయతీ సిబ్బంది మా వీధిలోని చెత్తా చెదారాన్ని, పిచ్చి చెట్లను తొలగించి తమ బాధ్యతను చాటుకున్నారని,సిబ్బంది సేవలకు గాను ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.