యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడ కుడ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక బేకరిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాణ్యమైన తినుబండారాలు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని అప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. వినాయక బేకరీ నిర్వాహకులు బయ్యా గణేష్ మాట్లాడుతూ వెరైటీ స్వీట్లతో అన్ని రకాల బిస్కెట్లతో వినాయక బేకరీ వినియోగదారులకు సేవలు అందించేందుకు సిద్ధమైందన్నారు. మావద్ద అన్ని రకాల వివాహ శుభకార్యలకు వెరైటీ సీట్లతో పాటు కేకులను తయారుచేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. పేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు వినాయక బేకరిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వట్టి ఖమ్మంపాడు పెద్దగోల్ల బయ్యా వెంకన్న, బిసి విద్యార్థి సంఘం నాయకులు బయ్య రాము యాదవ్, మాజీ జెడ్పిటిసి జట్టంగి వెంకట నరసయ్య, సోమలింగం, మట్టిపల్లి గంగయ్య, సైదులు, శ్రీను,బయ్యా మధు, ఎల్కపళ్లి నరేందర్, కిరణ్, మల్లేష్, సంతోష్, కృష్ణ తదితరులు ఉన్నారు.