November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రామ సభలను ఖచ్చితంగా షెడ్యుల్ ప్రకారం నిర్వహించాలి. గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి,   జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ 

జిల్లాలో గ్రామ సభలకు లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలి

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్ , అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యా నాయక్ ల తో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లాలోని ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల (రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు) పథకాలపై ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ సభల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నాలుగు సంక్షేమ పథకాల అమలును జనవరి 26న ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలను షెడ్యుల్ వారీగా ఖచ్చితంగా సమయపాలన పాటిస్తూ నిర్వహించాలని, ఎక్కడ కూడా నిర్లక్ష్యాని తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, గ్రామ సభలలో ఫ్లెక్సీ లు, టెంట్లు ,మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని, మెడికల్ టీం అందుబాటులో ఉండాలని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో అర్హుల జాబితాను ప్రచురించాలని, గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులపై నాలుగు పథకాలకు నాలుగు రిజిస్టర్ లను ఏర్పాటు చేసి, అర్జీలను స్వీకరించాలని, గ్రామ సభలలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని, ఎక్కువ గ్రామా పంచాయతీలు ఉన్నచోట ఉదయం 9.30 నుండి 12 30 వరకు , మద్యాహ్నం 1.30 నుండి 3 30 వరకు గ్రామ సభలను ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో నిర్వహించాలని, , ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని , సమస్యాత్మక సమస్యలకు సామరస్యంగా, సానుకూలంగా సమాధానం ఇవ్వాలని, ఆదేశించారు.

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలలో లబ్దిదారుల జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపించాలని, అభ్యంతరాలుంటే దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఎలాంటి అపోహలు తలెత్తకుండా ప్రజలకు స్పష్టంగా వివరించాలని, ఈ మొత్తం సంక్షేమ పథకాల రోజు వారీ ప్రక్రియను మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ సభల తీర్మాన ప్రతులను సురక్షితంగా, ఎంతో జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.

ఈ సమావేశంలో డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ , డిఎస్ఓ మోహన్ బాబు , పి డి హోసింగ్ కృష్ణ, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, డి టి డి ఓ కమలాకర్ రెడ్డి, ఎ డి సర్వే ల్యాండ్ అధికారి, ఇతర జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమీషనర్ లు, తహసీల్దార్ లు,మండలాల ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

యోగా జీవితంలో ఒక భాగం కావాలి

Harish Hs

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ షో – దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

TNR NEWS

ఐకెపి కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

రేవంత్ రెడ్డి వద్దు…  మళ్ళీ కేసీఆర్ రావాలని-ఓ అవ్వ ముచ్చట

TNR NEWS

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో  25 మంది లబ్ధిదారులకు. చెక్కుల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

TNR NEWS