దౌల్తాబాద్: రైతులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తే అదిక లాభాలు పొందవచ్చని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం రామారం గ్రామ పరిధిలోని ఆయిల్ పామ్ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగు లాభాలు, సాగు మేలుకువల గురించి రైతులకు అవగాహన కల్పించటం జరిగింది. ఆయిల్ ఫామ్ పంటకు నీరు ఎప్పుడు ఇవ్వాలి,సమయానికి ఎరువులు వెయ్యాలని సూచించారు.ఆయిల్ ఫామ్ పంట పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు డ్రిప్ పై 90-95 శాతం ఉంది అన్నారు. మొక్కలు కూడా సబ్సిడీ పై అందుబాటులో ఉన్నాయి.అదే విధంగా ఆయిల్ పామ్ వేసిన రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు మొత్తం రూ.42 వేలు రైతుకు ప్రోత్సాహకంగా ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ కు టన్నుకు రూ.19 వేలు ఉందని సరాసరిగా ఆయిల్ ఫామ్ 10-15 టన్నుల దిగుబడి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రవీణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
previous post