సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శిమల్లు నాగార్జునరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలో హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జనవరి 26న రైతులందరికీ రైతు భరోసా బ్యాంకులో జమ చేస్తానని చెప్పి నేటికీ జమ చేయకుండా రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వ్యవసాయ కార్మికులకు ఇస్తానన్న 12 వేల రూపాయలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. మహిళలకు ఇస్తామన్న 25 వందల రూపాయలు, ప్రభుత్వం పెంచుతామన్న పింఛన్లు వెంటనే పెంచాలన్నారు. వచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే భవిష్యత్తులో ప్రజలందరిని సమీకరించి ప్రజా పరాటాలను నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ మహాసభలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నె మ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, పారేపల్లి శేఖర్రావు నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు ,కోట గోపి ,చెరుకు ఏకలక్ష్మి ప్రతినిధులు పాల్గొన్నారు.
