Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
చరిత్రతెలంగాణరాజకీయం

నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

 

సూర్యాపేట: మహత్తరమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంలోనవంబర్ 29,30, డిసెంబర్ 1 న జరిగే సిపిఎం పార్టీ జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్ లో సూర్యాపేటలో జరిగే సిపిఎం జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ నవంబర్ 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, బీవీ రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శితమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మిలు హాజరవుతున్నారని తెలిపారు.నవంబర్30, డిసెంబర్ 1 తేదీల లో 500 మంది ప్రతినిధులతో సుమంగళి ఫంక్షన్ హాల్ లో మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభల విజయవంతానికై ప్రజలంతా హార్దికంగా,ఆర్థికంగా సహాయ సహకారాలుఅందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి,జిల్లా కమిటీ సభ్యులుబెల్లంకొండ వెంకటేశ్వర్లు, వేల్పుల వెంకన్న,వీరబోయిన రవి, చిన్నపంగా నరసయ్య,మద్దెల జ్యోతి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం పార్టీ ఆత్మకూరు మండల కార్యదర్శి ఆవిరి అప్పయ్య,సిపిఎం సీనియర్ నాయకులు చెరుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలి…. ఈ నెల 24న సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ఊరూరా ఉద్యమకారుల పాదయాత్ర పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి

TNR NEWS

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

TNR NEWS

వేనేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్

Harish Hs