సిపిఎం వరంగల్ జిల్లా 20వ మహాసభల సందర్భంగా ఈరోజు అమరవీరుల స్థూపం నుండి అంగడి సెంటర్ వరకు ఎర్ర చీరలు, టీషర్ట్ లతో డప్పులు, కోలాటలతో మహిళలు ముందు భాగంగా ఉండి డ్యాన్స్ లు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంత రం బహిరంగ సభ సీపీఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షత న నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ బిజెపి పాలనలో దేశంలో అనేక వైష్యమ్యాలు సృష్టిం చిందని అన్నారు. దేశ ప్రజల్లో స్వేచ్ఛ, స్వాతంత్రాలు, లౌకిక విధానం, పెడరల్ స్ఫూర్తిని నింపిన భారత రాజ్యాంగాన్ని మార్చి మనవాదాన్ని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం బిజెపి దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ చేస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. బిన్న సంస్కృతులకు,సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలతో కలిగిన సువిశాల భారత దేశంలో మతం అనే రంగును పూసి
వరంగల్ జిల్లా 20వ మహా సభలు బహిరంగ సభ
మనుషుల మధ్య విభజనలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్ట డానికి ప్రయత్నిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల న్నింటినీ ప్రైవేటుపరం బిజెపి మోడీ ప్రభు త్వము చేస్తుందని తెలిపారు. మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజల జీవితాలతో, వారి బ్రతుకులతో ఆడు తున్నారని విమర్శించారు మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై దేశ వ్యతిరేకులు గా ముద్రవేశి జైల్లో పెడుతూ దేశంలో అప్రటిత ఎమర్జెన్సీ అమ లుచేస్తుంది. మోడి ప్రభుత్వము తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్లచట్టాలకు వ్యతిరేఖంగా దేశ రాజధాని ఢిల్లీలో సుదీర్ఘ కాలం రైతాంగం ఆందోళన చేస్తే వ్రాత పూర్వక హామీలిచ్చి నల్లచట్టలను విరమించుకున్న మోడీ ప్రభుత్వమ్ ఇచ్చిన హామీలను ఈ రోజు
వరకు అమలు
చేయలేదని అన్నారు.
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఈ ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేం దుకు మోడి ప్రభుత్వము ప్రయత్నిస్తుంది. మోడీ ప్రభుత్వ విధానాలను వెనక్కి కొట్టడా ని ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తోంది. పూర్తి స్థాయిలో రైతుల రుణమాఫీ పూర్తి కాలేదని, రెండు వ్యవసాయ సీజన్లు పూర్తి అయినప్పటికీ రైతు భరోసా అందడం లేదని అన్నారు, 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు భ్రమలు కల్పించి ఇప్పుడు అమలు చేయడం లో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు, ఈ హామీల అమలుకు ప్రజలను ఐక్యం చేసి పోరాటల్లోకి తీసుకు రావాల్సిన అవసరం మిగతా నర్సంపేటలో కదం తొక్కిన కామ్రేడ్స్
మొదటి పేజీ తరువాయి
ఉందని అన్నారు, వరంగల్ జిల్లాలో నర్సంపేటలో కమ్యూనిస్టుల పూర్వ వైభవం తీసుకరావాలని పిలుని చ్చారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య, పోతినేని సుదర్శన్,, రాష్ట్ర నాయకులు జీ రాములు కాసు మాదవి, జిల్లా కార్యదర్శి చింతామల్ల రంగయ్య జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈసంపెల్లి బాబు, భూక్య . సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, నలిగంటి రత్నమాల, జిల్లా కమిటీ సభ్యులు నమిండ్ల స్వామి, బషీర్, పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ కందికొండ రాజు, ఇప్ప సతీష్, ఎండీ ఫరిదా, వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, నాగమణి నాయకులు తదితరులు పాల్గొన్నారు