టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ
స్వాతంత్ర్య సమరయోధుడు,భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ సెల్ డివిజన్ అధ్యక్షులు షేక్ బాజాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం ఏ జబ్బార్ హాజరై అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప మహనీయుడు అని సమైక్య భారతావానికి ఎనలేని కృషి చేశాడని ఆయన సేవలను కొనియాడారు.వారి జన్మదినం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. నేటితరం వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాజాన్,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బషీర్, వార్డ్ కౌన్సిలర్లు షాబుద్దీన్, ఖాజా, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఎస్దాని, ఉపాధ్యక్షులు అలీ ,నజీర్,
మండల పార్టీ అధ్యక్షుడు ఖలీల్, 15,16 వార్డు ఇంచార్జ్ జహీర్,వర్కింగ్ ప్రెసిడెంట్ బాబా, ఫయాజ్, మాజీ కౌన్సిలర్ షమ్మీ, మాజీ కో ఆప్షన్ బాగ్దాద్,షఫీ, ,అహ్మద్ ,మౌలానా ,మౌలాలి, కాసిం, మాజీ కౌన్సిలర్ షమ్మీ ,మండల నాయకులు ఎండి హసన్ తదితరులు పాల్గొన్నారు…………