April 5, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం

 

పెద్దపల్లి;

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళలను కారు వెనుక వైపు నుండి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఉదయ నగర్ కు చెందిన నలుగురు మహిళలు పట్టణ శివారుని ఓ ఫంక్షన్ హాల్ లో పనులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా పెద్దపల్లి ఆదర్శనగర్ వద్ద కరీంనగర్ నుండి గోదావరిఖని వెళ్తున్న గుర్తుతెలియని వాహనం నలుగురు మహిళలను వెనకవైపు నుంచి ఢీకొట్టడంతో అమృత భాగ్య అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పద్మ అనే మరో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరో మహిళ స్వల్ప గాయాలతో నుండి బయటపడింది. అతివేగంగా మహిళలను ఢీ కొట్టిన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ అక్కడ నుంచి పారిపోయిన విషయాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకొని కారును గుర్తించే పనిలో పడ్డారు.

Related posts

గీతా కార్మికులకు అదిరిపోయే శుభవార్త..!

TNR NEWS

లయన్స్ క్లబ్ దేశాయి ఆత్మకూర్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం

TNR NEWS

అక్రమ రవాణా చేస్తున్న 3కిలోలు ఎండు గంజాయి పట్టివేత రెండు మొబైల్ ఫోన్లో ఒక ద్విచక్ర వాహనం ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు

TNR NEWS

నోట్ః ఈ ఐటమ్‌ను తప్పకుండా వాడుకోగలరు విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటా   రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తా  జోగిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆకుల చిట్టిబాబు 

TNR NEWS

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS

కామదేను 2024 అవార్డు  

TNR NEWS