కోదాడ పట్టణంలో మండపం ఏరియాలో డబ్బాకొట్లు ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారాలు చేసుకుంటూ గత యాభై సంవత్సరాలుగా అప్పటి గ్రామపంచాయతీకి ప్రస్తుతం మున్సిపాలిటీకీ పన్నులు చెల్లిస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న వారి డబ్బా కొట్టను తొలిగించాలని, లేని యెడల మేమే బలవంతంగా మీ డబ్బా కొట్లు తొలగిస్తామని మునిసిపాలిటీ భయబ్రాతులకు గురి చేయడం అన్యాయమని కోదాడ పట్టణ అఖిలపక్ష నాయకులు అన్నారు. గత నలభై యాభై ఏళ్ళుగా నిరుపేదలైన వారు డబ్బాకొట్లు ఏర్పాటు చేసుకొని బతుకుతుంటే వారిని అక్కడనుంచి వెళ్ళగొట్టాలని చూడటం వారి జీవనం మీద దెబ్బకొట్టడమేనన్నారు. ఒకవేళ మునిసిపాలిటీ వారు బలవంతముగా ఆ డబ్బా కొట్లను తొలగించాలని చూస్తే ఊరుకునేది లేదని, ఎంతటి పోరాటానికైనా సిద్దమేనని సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు తెలియజేశారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విషయముపై డబ్బాకొట్టు దుకాణం దారులు *గౌరవ హైకోర్టును ఆశ్రయించగా వారి తరపున వీర్జాల ప్రవీణ్ కుమార్ లాయర్ గారు హైకొర్టులో వాదనలు వినిపించగా గౌరవ హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ ఆ డబ్బా కొట్లను తొలగించరాదని ఆదేశాలు జారి చేసినట్టు* వారు తెలియజేశారు.
ఈ అఖిలపక్ష సమావేశంలో డబ్బాకొట్టు దుకాణం దారుల సంఘం అధ్యక్షుడు షేక్ నయీమ్, గౌరవ అధ్యక్షుడు, BJP రాష్ట్ర నాయకుడు బొలిశెట్టి కృష్ణయ్య, C.P.I నాయకుడు మేకల శ్రీనివాసరావు, C.P.I పట్టణ కార్యదర్శి షేక్ లతీఫ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు SD ముస్తఫా, కందరబోయిన వేలాద్రి, BRS పార్టీ టౌన్ జనరల్ సెక్రెటరీ కర్ల సుందర్ బాబు, దొంగరి శ్రీనివాస్ పలువురు డబ్బాకొట్టు దుకాణం దారులు షేక్ దస్తగిరి, నరహరి, కర్ల రాజు, సింహాచలం, రావూఫ్,సోమపంగు సైదులు, మౌలానా, సైదులు, మహమ్మద్, అబ్దుల్ రహీం, రాంబాబు, హుస్సేన్భీ, దస్తగిరి, లక్ష్మీ, కల్పన, స్రవంతి, గోపాలకృష్ణ, ముస్తఫా, ఆరిఫ్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు…..