Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు వినిపిస్తుండగా.. తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు పట్నం నరేందర్‌ రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఆపదలో ఉన్నవారికి కాకతీయ సేవా సమితి అండగా ఉంటుంది

TNR NEWS

పార సీతయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం

Harish Hs

అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలి…. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో, అంబేద్కర్ వర్ధంతి

TNR NEWS

గురుకుల పాఠశాల లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాము  సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వర్ రావు 

TNR NEWS

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన

TNR NEWS

కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి  – మంత్రులు కొండ సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి లకు వినతి పత్రం అందించిన నాయకులు

TNR NEWS