Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆరోగ్యం వైద్యంతెలంగాణ

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి ,పి.స్వాతి, శీర్షిక లతో కూడిన బృందం పర్యటన
సూర్యపేట పట్టణంలో ఎల్ ఎస్ బేకరీ మరియు కావేరి గ్రాండ్ హోటల్, తనుస్ లోగిలి హోటల్, డాల్ఫిన్ బేకరీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ హోటల్స్ నందు వంట గదులు అపరిశుభ్రంగా ఉండడం రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మైంటైన్ చేయకపోవడమ్, మరియు సుమారు 52 వేల రూపాయల విలువ కలిగిన నిలువ చేసిన కుళ్ళిన మాంసపు, చేపల ఉత్పత్తులను, హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన చికెన్ పలు రకముల చేపలు తందూరి చికెన్ కుళ్లిపోయిన గుడ్లు మరియు నిల్వ ఉంచిన గోధుమపిండి గుర్తించడంతో హోటల్ యాజమాన్యం పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ అయిన వి. జ్యోతిర్మయి మరియు టాస్క్ఫోర్స్ టీం అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలవకూడదని మాంసపు ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే బేకరీలలోని వంట గదిలో అపరిశుభ్రంగా ఉండడం వాడిన నూనెను మళ్ళీ మరగబెట్టి వాడడం మరియు 5 వేల రూపాయల విలువగల ఎక్స్పైర్ కలర్ స్ప్రేలు మరియు లేబుల్ డిక్లరేషన్ లేనటువంటి కేక్ మరియు బ్రెడ్ ప్యాకెట్లను అక్కడికక్కడే ధ్వంసం చేసి బేకరీ యజమానులకు ఎఫ్ ఎస్ ఎస్ యాక్ట్ ఉల్లంఘించినందుకుగాను నోటీసులు జారీ చేయడం జరిగింది అలాగే పలు అనుమానాస్పద శాంపుల్స్ ని సేకరించడం జరిగింది. నూనెను మరిగించి పదేపదే మరిగించి అదే నూనెతో ఆహార పదార్థాలు తయారు చేసి వినియోగదారులకు విక్రయించడం క్యాన్సర్ లాంటి పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి, వారికి వెంటనే ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చి, బాగా మరిగించిన నూనెను కాలువలో పారబోయించడం జరిగింది. ఈ రకమైన ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఆహార తయారీదారులు మరియు ఆహారం అమ్మేవారు ఎంతటి వారైనా ఆహార పరిరక్షణ ప్రమాణాలను పాటించి, ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని హెచ్చరిస్తూ లేనియెడల చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ అవసరమైతే సంబంధిత శాఖ సహాయంతో సీజ్ కూడా చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ దాడులలో అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Related posts

భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

Harish Hs

న్యాయవాదుల పై దాడులను అరికట్టాలి

Harish Hs

పంతానికి పోతే ఒకరే గెలుస్తారు… రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు

TNR NEWS

బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

TNR NEWS

ఘనంగా హోలీ సంబరాలు

TNR NEWS

రాష్ట్ర కార్యదర్శిగా కనెవేని శ్రీనివాస్

TNR NEWS