Tnrnews.in
తెలంగాణ

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్లేట్ ది స్కూల్ ఫౌండర్ వాసిరెడ్డి అమర్ నాధ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అమృత రామానుజరావు ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ అనే అంశంపై ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి శేష ప్రసాద్ అధ్యక్షతన కళాశాల విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు. సెమినార్ ను ఉద్దేశించి వాసిరెడ్డి అమర్ నాధ్ మాట్లాడుతూ ఏ రంగంలో చూసినా ఏఐ హవా నడుస్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భయం అవసరం లేదన్నారు. కాలంతోపాటు టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయని రానున్న రోజుల్లో ఏఐ లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుందని సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి భవిష్యత్తులో ఎలాంటి డోకా ఉండదన్నారు. సాంకేతిక విద్యలో నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలని సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలన్నారు. ఈ సెమినార్ లో కళాశాల డైరెక్టర్ నాగార్జున, ప్రిన్సిపల్ గాంధీ, కోమరగిరి రంగారావు, ట్రస్ట్ సభ్యులు కొండపల్లి శారద ప్రసాద్, కొండపల్లి శ్రీ వాత్సవ్, కొండపల్లి శ్రీకర్, న్యాయవాది అక్కిరాజు యశ్వంత్, కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు……….

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

TNR NEWS

జీవనది ఫౌండేషన్ యమునా నది పుష్కరాల పోస్టర్ ఆవిష్కరించిన ఉమర్ ఆలీషా

TNR NEWS

మహిళలు సామాజిక సమానత్వం సాధించాలి

TNR NEWS

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

TNR NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS

ముఖ్యమంత్రి హామీ మేరకు – చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను, మహిళా కమిషన్ సభ్యులుగా నియమించాలి

Harish Hs