Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణప్రత్యేక కథనం

మౌనిక డబుల్‌ ధమాకా…! రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పేదింటి బిడ్డ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే

జోగిపేట :- ఒక్క ఉద్యోగం లభించడమే కష్టంగా ఉన్న రోజులివి. అలాంటిది ఒక పేదింటి బిడ్డ ఇటీవల జరిగిన కాంపిటేటివ్‌ పరీక్షల్లో రెండు ప్రభుత్వాలను సాధించింది. అందోలు మండలం నాదులాపూర్‌ గ్రామానికి చెందిన హేమలత, శివ్వప్పలకు చెందిన మిరపకాయల మౌనిక ఇటీవల జరిగిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని సంపాదించగా, గురువారం విడుదల చేసిన గ్రూప్‌ 4 పరీక్షల ఫలితాల్లో కూడా మౌనిక ఎంపికవడం ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శివ్వప్పకు కొడుకు,కూతురు ఉన్నారు. ఉన్న కొద్ది వ్యవసాయ భూమిలో పంటలు పండించుకుంటూ ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించింది. ప్రైవేట్‌ పాఠశాలలో చదివించే స్తోమతలేని కుటుంబంలో పుట్టిన మౌనిక నాదులాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య, డాకూర్‌ ప్రభుత్వ పాఠశాలలో హైస్కూల్‌ విద్యను మంచి మార్కులతో పూర్తి చేసి, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ తో ఇంటర్‌ పూర్తి చేసి, ఉన్నత విద్యకు ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సంపాదించి ఉన్నత విద్య చదువుతూనే తన ఉద్యోగ వేటలో అలుపెరగని పోరాటం చేస్తూ ముందుకు సాగింది. కష్టే ఫలి అన్న నానుడిని నిజం చేస్తూ ఇటీవల జరిగిన కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ గా ఎప్పింకైంది. తిరిగి గ్రూప్‌ 4లో కూడా ఎంపికైన విద్యాశాఖలో ఉద్యోగాన్ని సంపాదించింది.

మా కోరిక నెరవేరింది

మా బిడ్డ మాలాగ వ్యవసాయ చేయకూడదని, గృహిణిగా మిగిలిపోవద్దని మేము కష్టపడుతూ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదివించాం. మా ఆశలు నిరాశపరచకుండా ఎక్సైజ్‌కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం డిప్యూటేషన్‌పై శివ్వంపేట చార్మినార్‌ బ్రూవరీస్‌లో ఉద్యోగం చేస్తుంది. ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలన్న పట్టును వీడకుండా చదువుతూనే ఉంది. మరొక ఉద్యోగం సంపాదించింది చాలా సంపాదించింది.

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని వదులుకోనున్న మౌనిక

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని వదులుకొని గ్రూప్‌ 4లో సాధించిన విద్యాశాఖ ఉద్యోగంలో మౌనిక చేరనున్నట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. గ్రూప్‌ 3 పరీక్షలు కూడా వ్రాసిందని ఆ ఫలితాల్లో కూడా మౌనిక ఉద్యోగం సంపాదించే అవకాశం ఉందని గ్రామస్తులు అంటున్నారు. మౌనిక రెండు ఉద్యోగాలు సాధించినందుకుగాను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Related posts

బీఆర్‌ఎస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు ● డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి

TNR NEWS

*ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం* *ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం డాక్టర్ యమున ఆధ్వర్యంలో* 

TNR NEWS

ఆశా”ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి  సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన కలెక్టరేట్ ముందు ఆశాల నిరసన

TNR NEWS

జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం… •కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు

TNR NEWS

గాయత్రి షుగర్స్ లో బీఎంఎస్ ఘనవిజయం

TNR NEWS

తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

TNR NEWS