Tnrnews.in
తెలంగాణరాజకీయం

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో టి యు ఎఫ్ ఐ డి సి నిధులు ఆరు కోట్ల రూపాయలతో నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి తన శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసి రాష్ట్రంలోనే ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుపుతానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి. చందర్ రావు, మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కమిషనర్. రమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు………….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పెరిక హాస్టల్ అభివృద్ధికి కృషి చేయాలి

Harish Hs

జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు….. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

ఎర్నేని బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి

TNR NEWS

రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా పరిశీలించాలి

TNR NEWS

యువత క్రీడల్లో రాణించాలి

TNR NEWS

కానిస్టేబుల్ నరేష్ పై దాడి చేసిన వారిని‌ శిక్షించాలి

Harish Hs