Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలుచుకొని విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం ప్రైవేట్ పాఠశాలలు మోపుతున్నాయని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని పట్టణ పార్టీ కార్యాలయంలో జరిగిన వన్ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూప్రవేట్ కార్పోరేట్ పాఠశాలలు అనేక కోచింగ్ సెంటర్ల పేరుతోటి నవోదయ గురుకులం సైనిక్ పేర్లతోటి ఓలంపియాడ్, ఐపీఎల్, గ్లోబల్, IPL. ఇంటర్నేషనల్ సీబీఎస్సీ గ్లోబల్స్ అనే ఆకర్షణీయమైన పేర్లతో మాయ చేస్తూ, యూకేజీ నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల నుంచి పుస్తకాలు, టై,బెల్ట్‌లు, డ్రెస్‌లు, మరెన్నో పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. కొంతమంది యాజమానులు డొనేషన్ పేరిట నర్సరీ నుండి పదో తరగతి వరకు రూ.1,50,000 వరకు వసూలు చేస్తున్నారని, ఇది తల్లిదండ్రులపై తీవ్ర భారం పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్య హక్కు చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉచితంగా కనీసం 25% సీట్లు ఇవ్వాల్సిన నిబంధనను అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.జిల్లా విద్యా అధికారులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై తక్షణమే స్పందించి సంబంధిత యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు మామిడి పుల్లయ్య, అర్వపల్లి లింగయ్య, కప్పల సత్యం, మాధగోని మల్లేష్, ఒట్టే ఎర్రయ్య, శశిరేఖ, జయమ్మ, పిట్టల రాణి పాల్గొన్నారు.

Related posts

అదుపుతప్పి ముక్త్యాల బ్రాంచ్ కాలువలో పడిన ఆటో పలువురికి గాయాలు

TNR NEWS

స్వాతంత్ర్య అమరులకు ఘన నివాళి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

గుడిబండ గ్రామంలో ఉర్సులో తీవ్ర విషాదం

Harish Hs

రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి…  రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు త్వరలో మిగిలిన రైతులకు రుణమాఫి నిధుల జమ ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా అందే సహాయాన్ని వివరిస్తూ గ్రామాలలో బోర్డులు ఏర్పాటు *ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

TNR NEWS

డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరును విజయవంతం చేయాలి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ మంథని సామెల్ మాదిగ

TNR NEWS

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS