కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక పున్నమిని పురస్కరించుకుని
ప్రదోషకాలం గంగరేగిచెట్టు ఆవరణలో కార్తీక దీపోత్సవంలో బాగంగా కార్తీక పౌర్ణమి శుభ పర్వని శ్రీలలితా సహస్రనామ లలితా త్రిశతీనామ శ్రీ సూక్త దుర్గాసూక్త రుద్ర సూక్త శ్రీ రుద్ర పారాయణ పూర్వక లక్షవర్తిక లింగాకార దీపార్చన కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమములో కొమురవెల్లి గ్రామ మహిళలు మరియు రాష్ట్రంలోని వివిధ ప్రాంతములనుండి వచ్చిన భక్తులు దీపోత్సవంలో పాల్గొన్నారు.కార్యానిర్వనాధికారి సకుటుంబంగా దీపోత్సవం చేసినారు.ఇట్టి కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షకులు,ఆలయసిబ్బంది పాల్గొని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు కార్యక్రమములో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదములు అందజేసి ఆశీర్వదించడం జరిగినది.