సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు మునగాల మండలానికి ఈ యాసంగి సీజన్ కి 677 మట్టి నమూనాల సేకరణ లక్ష్యం కేటాయించడం జరిగింది.
ఈకార్యక్రమంలో భాగంగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలని వారి క్లస్టర్ పరిధిలోని గ్రామాల నుండి సేకరిస్తున్నారు.
కావున రైతులు ఎవరైనా మట్టి నమూనాలు ఇవ్వదలుచుకుంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి సమాచారం ఇవ్వగలరు.
రేపాల, మునగాల, నేలమర్రి, బరాకతుగూడెం గ్రామాల నుంచి ప్రస్తుతం నమూనాలు స్వీకరిస్తున్నారు
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు నాగు,రేష్మ, రమ్య, భవాని మరియు రైతులు పాల్గొన్నారు