సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని రామాపురం ( కట్టకొమ్ముగూడెం ) గ్రామంలో ఏర్పాటు చేసిన. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమని. ఇలాంటి దుక్షర్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు తదుపరి మాట్లాడుతూ. పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా పేరుగాంచి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు. ముఖ్యంగా యువతకు రాజకీయ అవకాశాలు కల్పించిన అనితర సాధ్యులని. సీని రంగంలో ఎన్నో సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలలో నటించిన కళామతల్లి ముద్దుబిడ్డ. రాముడిగా శ్రీకృష్ణుడిగా ఏ పాత్రలోనైనా. ఒదిగిపోయే కళామతల్లి ముద్దుబిడ్డ. తరాలు మారిన తరగని అభిమానాన్ని చూరగొంటున్న. గొప్ప నటుడుగా రాజకీయవేత్తగా పేరు ప్రఖ్యాతులుగాంచిన గొప్ప నేతని. యుగ పురుషుడిగా ఆరాదింప బడుతున్న గొప్ప వ్యక్తి అని తెలుగుజాతి కీర్తిని ఔన్నత్యాన్ని తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశం నలుమూలల వ్యాపింపజేసి తెలుగు వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాన్ని. ధ్వంసం చేయడం అనేది హేయమైన చర్య అన్నగారి విగ్రహం పై దాడి అంటే. తెలుగు వారి ఆత్మ గౌరవం పై దాడి అన్నట్లే అని ఆయన అబిమానుల మనోభావాలను దెబ్బ తీసినట్లేనని ఇలాంటి వికృత చేష్టలు విడనాడాలని ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘ విద్రోహ చర్యలను ఖండిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ పార్టీలకు రాజకీయాలకతీతంగా ఖండించాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి వారిని. చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు