Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బదిలీపై వెళ్లిన మండల విద్యాధికారికి ఘన సన్మానం ముఖ్యఅతిథిగా తాజా మాజీ జడ్పిటిసి పాశం రాంరెడ్డి

తిప్పర్తి మండల ఎం ఆర్ సి కార్యాలయం నందు ఇటీవల బదిలీపై వెళ్ళిన తిప్పర్తి మండల విద్యాధికారి శ్రీమతి కత్తుల అరుంధతి ని మండల విద్యాశాఖ ఆధ్యర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాట చేయనైనది ఇట్టి సమావేశమునకు ముఖ్య అతిథిగా తిప్పర్తి తాజా మాజీ జెడ్పిటీసీ పాశం రాంరెడ్డి హాజరై అరుంధతి గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు పాఠశాలల్లోనే ఉందని పేర్కొన్నారు. మండల విద్యాధికారి గా అరుంధతి ఈ మండలంలో విశిష్టమైన సేవలు అందంచారని, వారు పాఠశాలల అభివృద్ధి కోసం, విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని, రాబోవు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మ

విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచడం కోసం ఉపాయులు కృషి

చేయవలసిన అవసరముందని తెలుపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నరసింహ నాయక్ మాట్లాడుతూ తిప్పర్తి మండలంలో పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాద్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు అరుంధతి గారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రధానపాధ్యాయులు తగరం అరుణ శ్రీ, ప్రధానోపాద్యాయులు పౌకత్ అల్. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ . ఎ అపర్ణ ,జయమ్మ, వెంకటయ్య , సంఘాల ప్రతినిధులు మహేందర్ రెడ్డి, కోడదల శంకర్, ఆదిమళ్ళ శ్రీనివాస్, గుర్రం రవి, దామెర్ల వెంకయ్య, లింగమల్లు, శేషయ్య, లక్ష్మీనారాయణ, తిరుమల్ రెడ్డి తదితరాలు పాల్గొన్నారు.

Related posts

మహిళా సంఘ డైరెక్టర్ గా ఆవుల విజయలక్ష్మి

TNR NEWS

ఆశా వర్కర్ల అరెస్ట్ అక్రమం

Harish Hs

వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలి

Harish Hs

కోదాడ పట్టణంలో భారీ వర్షం వీధులన్నీ జలమయం

TNR NEWS

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే విధంగా మీ కమిటీ పని చేయాలి…

TNR NEWS