భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని దేశానికి అంకితమిచ్చి 75 సంవత్సరాలు అయిందని భారతదేశాన్ని సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతోమంది పెద్దలు కృషి చేశారని వారిలో అంబేద్కర్ కృషి ఎనలేదని బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువా రెడ్డి, నలగామ శ్రీనివాస్ అన్నారు మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా బిజెపి కార్యాలయంలో బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం బిజెపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దారం గురువారెడ్డి నలగామ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనాల రూపకల్పన మాత్రమే కాదని కోట్లాది పీడిత ప్రజల ఆశయాలకు ప్రతిభింభము డా. బి ఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా రూపుదిద్దుకున్నదే మన భారత రాజ్యాంగం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి, కుడిక్యాల రాములు, వేదాంతం వెంకటరమణ, దేవులపల్లి మనోహర్ యాదవ్, సంపత్ రెడ్డి, రమణ ,నరసింహ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు