పెద్ద గూడూరు మండలం :- మహబూబాద్ జిల్లా, ఆదివారం రోజున ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా, మొదటి రోజు విద్యా దినోత్సవం సందర్భంగా, మండల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఇందులో మండలంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో, మండల విద్యాశాఖ అధికారి జే. రవి కుమార్ నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానం, డి. అనిల్, జెడ్పిహెచ్ఎస్ అయోధ్యాపురం, ద్వితీయ స్థానం, బి. పరమేశ్వరి, జడ్పిహెచ్ఎస్ తీగలవేణి, తృతీయ స్థానం, బి. ఉదయ్ కిరణ్, టి జి టి డబ్ల్యూ ఆర్ జె సి బాయ్స్ దామరవంచ విద్యార్థులు గెలుపొందారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థి జిల్లాస్థాయి వ్యాసరచన పోటీకి ఎంపికై, రెండవ తారీకున మహబూబాబాద్ లో పాల్గొనాలి. ఈ కార్యక్రమ కన్వీనర్ గా డాక్టర్ జి. చంద్రమౌళి వ్యవహరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిడి బిక్షపతి, సిఆర్పి రవికుమార్, వంగరాజు, అప్పారావు, ఉమారాణి పాల్గొన్నారు.