వికారాబాద్ లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా డిఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ ఆశ వర్కర్లకు పెండింగ్లో ఉన్న లెప్రసి, పల్స్ పోలియో డబ్బులు వెంటనే చెల్లించాలని, డబ్బులు చెల్లించాకే, కొత్త సర్వేలు చేస్తామని డిఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నాచేయడం జరిగింది. పెండింగ్ డబ్బులు ఇవ్వకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఈ డిసెంబర్ 2 నుండి కొత్త సర్వేలు చేయాలని అధికారులు ఇబ్బందుల గురి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్వేలు ఆపాలని,2023నుండి ఏడాది నరా పెండింగ్ డబ్బులు చెల్లించాలని ఆ తర్వాతనే సర్వేలు చేయించాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. పై నుండి ఆర్డర్ కాపీ ఇచ్చి డబ్బులు రిలీజ్ చేసినా, కింది స్థాయిలో జిల్లా అధికారులు ఇవ్వడం లేదు. పైనుండి ఆర్డర్ కాపీ ఇచ్చిన జిల్లా అకౌంట్ లో డబ్బులు రాలేదని జిల్లా అధికారులు తెలుపుతున్నారు. రాష్ట్ర అధికారుల మధ్యన జిల్లా అధికారుల మధ్యన ఆశ వర్కర్లు నలిగిపోతున్నారు తక్షణము రాష్ట్ర ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపి పెండింగ్లో ఉన్న ఆశ వర్కర్ల పని చేసిన డబ్బులు వెంటనే చెల్లించాలని, డబ్బులు లేక ఆశ వర్కర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సంవత్సరలా తరబడి చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఇప్పుడు మళ్లీ కొత్త సర్వేలు చేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు న్యాయమని ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర జిల్లా కమిటీలు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాయి ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చేసి డబ్బులు చెల్లించాలని ఆర్థికంగా ఆదుకో లేనిచో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నము. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిఎంహెచ్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నము అన్నారు తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు యూనియన్ గా వికారాబాద్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాము. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు లావణ్య యాదమ్మ గోవిందమ్మ పుష్పలత, సునీత స్వప్న జయమ్మ పద్మ విజయ మొగులమ్మ మంజుల ఈ విజయ వెంకటమ్మ చంద్రకళ మంగమ్మ జంగమ్మ జయమ్మ ఇతరులు పాల్గొన్నారు.