మద్దూర్ డిసెంబర్ 03 (TNR NEWS) : ప్రభుత్వ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆటపాట”
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆరు గ్యారంటీ ల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశానుసారం డిపిఆర్ఓ రషీద్ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి కళాకారులు మంగళవారం ఉదయం మద్దూరు మండలంలోని మోమినాపూర్ రేణివట్ల యాదవరావుపల్లి గ్రామాలలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ఆటపాటల ద్వారా అవగాహన కలిగించారు. రైతు రుణమాఫీ ఆరోగ్యశ్రీ 500 కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్లు ఉచిత కరెంటు రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజకు మద్దతు ధర రైతులకు 500 బోనస్ అందిస్తామని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి కళాకారులు రవిశంకర్ కిరణ్ నరసింహ బాలయ్య లక్ష్మి అరుణ జ్యోతి సుగుణ ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.