వారం రోజుల్లోగా గౌరవ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గార్ల చేతుల మీదుగా మునగాల ప్రభుత్వాసుపత్రి ప్రారంభం అవుతుందని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండు మూడు రోజుల క్రితమే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్న చిన్న చిన్న పనులను సంబంధిత కాంట్రాక్టర్ పూర్తి చేసి హెల్త్ డిపార్ట్మెంట్ కు అప్పగించారని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుంచి కూడా అనుమతి వచ్చిందని మంత్రిగారి సమయ వెసులుబాటును బట్టి ఈ వారంలోగా ప్రారంభిస్తారని తెలిపారు. కాగా ఇట్టి ప్రభుత్వాసుపత్రిని 24 గంటలు ఆసుపత్రిగా మార్చడంతో పాటు ఈ ఆస్పత్రిలోనే వివిధ ప్రమాదాల గురై చనిపోతున్న వారి శవాల కు కూడా పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలని మంత్రి గారిని గతంలో కోరడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా కోరుతున్నాను.