మద్దూరు డిసెంబర్ 03 ( TNR NEWS ): మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిఎసిఎస్ చైర్మన్ నర్సిములు మంగళవారం రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి మద్దూరు మండల కేంద్రంలో గత నెలలో మాత్రమే 13 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అలాగే కొడంగల్ నియోజకవర్గం మొత్తానికి 10 నెలల కాల వ్యవధిలో 12 కోట్ల రూపాయలు సిఎంఆర్ చెక్కులు పేదలకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు భీమమ్మ, బాలరాజు, రసూల్, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనీవర్ధన్ రెడ్డి, నర్సింలు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.