మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ మూల స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు.హిందీ సిఆర్టి పోస్టుకు ఎంఏలో హిందీ,బిఈడి అభ్యర్థులు అర్హులని తెలిపారు.పిజి నర్సింగ్ పోస్టుకు బిఎస్సి నర్సింగ్ కోర్సు చేసిన వారు అర్హులన్నారు.సివిక్స్ సిఆర్టి పోస్టుకు ఎంఏ పొలిటికల్ సైన్స్,బిఈడి అభ్యర్థులు అర్హులు అని తెలిపారు.3 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని,అర్హత గల మహిళా అభ్యర్థులు కెజిబివి ఎస్ఓ 9640418320 నెంబర్ లో రెండు రోజుల్లో సంప్రదించాలని స్వప్న కోరారు.